![]() |
![]() |
నాన్న కూతురు బాండింగ్ ఎంత స్వచ్చమైనదో నిరూపిస్తు బిగ్ బాస్ సీజన్-9 లో ఆరో వారం ఎలిమినేషన్ జరిగింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత ఆటస్వభావమే మారిపోయింది. నిన్నటి సండే దీపావళి ఎపిసోడ్ లో భరణి హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు.
దీపావళి ఎపిసోడ్ లో భాగంగా ఆటలు పాటలు డ్యాన్స్ లు అన్నీ చేయించాడు నాగార్జున. దానితో పాటుగా నామినేషన్లో ఉన్నావారిని ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు నాగార్జున. ఇక అందరిని సేవ్ చేయగా చివరగా రాము రాథోడ్, భరణి ఎలిమినేషన్ రౌండ్ లో ఉన్నారు. దాంతో దివ్య, తనూజ ఇద్దరు ఏడపు మొహాలు పెట్టేసారు. ఓ వైపు ఎపిసోడ్ లో గేమ్ లు జరుగుతుంటే తనూజ ఏడ్చేసింది. దాంతో తనని కన్ఫెషన్ రూమ్ కు పిలిచాడు నాగార్జున. ఏం అయింది ఎందుకు ఏడుస్తున్నావని నాగార్జున అడిగాడు. " నేను ఫ్యామిలీకి దూరంగా ఉండడం ఇప్పటి వరకూ జరగలేదు. హౌస్ లోకి రాగానే ఎక్కువగా కనెక్ట్ అయ్యింది భరణి గారితోనే. ఆయన ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా, నాన్న లాగా కనెక్ట్ అయ్యారు. అందరు ఆయన వల్ల గేమ్ పోతుంది, ఆ బాండింగ్ వల్ల వెనక్కి వెళ్తున్నావు, ఆయన వల్ల గెలుస్తున్నావని చెప్పడంతో ఎంత ఇష్టం ఉన్నా దూరంగా ఉంటూ వచ్చాను. కానీ ఇప్పుడు మాత్రం చుట్టూ అందరు ఉన్నా హెవీగా ఉంది" అంటూ తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. బంధాలు బర్డెన్ కావొద్దు. ముందుకెళ్తావా అక్కడే ఉంటావా.. అన్నది నీ ఇష్టం . నీ ఆటతో పాటు మాట బిహేవియర్ క్యారెక్టర్ నిన్ను గెలిపిస్తుందంటూ నాగార్జున మోటివేట్ చేశాడు.
తనూజ-భరణిల బాండింగ్ నిజంగా ప్యూర్ బాండింగ్. తన ఆటకోసం దూరంగా ఉన్న తనూజ.. భరణి ఎలిమినేషన్ కాకముందే.. ఎలిమినేషన్ రౌండ్ లో రాముతో ఉన్నప్పుడే ఏడ్చేసింది. అంటే గేమ్ కోసం, హౌస్ మేట్స్ కోసం దూరంగా ఉన్నా.. భరణి బయటకు వెళ్తాడా అనే ఆలోచన రాగానే తను ఏడ్చేసింది. దీన్ని బట్టి తెలుస్తుంది వారిద్దరిది ఎంత ప్యూర్ బాండింగో.. ఈ ఎపిసోడ్ చూసిన ఎవరికైనా కన్నీళ్ళు ఆగవు అనేంతలా తనూజ ఏడ్చేసింది.
![]() |
![]() |